EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో డా.వలిఉల్లా ఖాద్రికి ఘన సన్మానం ఉద్యమ సేవలను గుర్తుచేసుకున్న ఐక్య వేదిక నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 07:07 PM | TELANGANA, వరంగల్
    ఉద్యమకారుల ఓదార్పు యాత్రలో డా.వలిఉల్లా ఖాద్రికి ఘన సన్మానం ఉద్యమ సేవలను గుర్తుచేసుకున్న ఐక్య వేదిక నాయకులు

    తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 19
    వరంగల్: తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక చేపట్టిన ఓదార్పు యాత్ర రెండో రోజు వరంగల్ నగరంలోని ఎల్‌బీనగర్‌లో కొనసాగింది.ఈ సందర్భంగా వేదిక నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకుడు డా.సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి నివాసానికి చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా,కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యమ నాయకుడిగా,విద్యార్థి–యువజన సమస్యలపై పోరాడిన నాయకుడిగా,సమాజ సేవలో అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.వేదిక చైర్మన్ జి.రవికుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో డా.వలిఉల్లా ఖాద్రి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా పోలీసు కేసులు నమోదయ్యాయని,జైలు శిక్ష కూడా అనుభవించారని పేర్కొన్నారు.విద్యార్థి ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం వరంగల్‌కు గర్వకారణమన్నారు.విద్యార్థులు,యువత,సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.సన్మానానికి స్పందించిన డా.సయ్యద్ వలి ఉల్లా ఖాద్రి..తనకు లభించిన గౌరవాన్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యమకారుల సంక్షేమం,గౌరవభృతి,గుర్తింపు,ఇతర సంక్షేమ పథకాలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని కోరారు.కార్యక్రమంలో ఉద్యమకారులు,యువజన నాయకులు,స్థానిక ప్రజాప్రతినిధులు,ఎల్‌బీనగర్‌ వాసులు పాల్గొన్నారు.జై తెలంగాణ నినాదాలతో కార్యక్రమం ముగిసింది.