EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కల్లెడ లో ఘనంగా మహా అన్నదానం

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 09:03 PM | TELANGANA, వరంగల్
    కల్లెడ లో ఘనంగా మహా అన్నదానం

    పర్వతగిరి (కల్లెడ):
    జన చరిత్ర న్యూస్
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ముంజాల రాజకుమార్ అన్నదాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.
    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ వీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్, మండల అధ్యక్షులు హార్కవత్ వినోద్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
    ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ... దానాలన్నింటిలోకి అన్నదానం అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామంలో ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సేవా నిరతితో ముందడుగు వేస్తున్న యువతకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో ఏకాదంతాయ యూత్ యువజన సంఘం అధ్యక్షులు టి. శ్రీనాథ్, సభ్యులు పి. సందీప్, బి. అనిల్, సిహెచ్. రాజ్‌కుమార్, ఇ. సందీప్, చి. అజయ్, బి. భరత్, ఇ. సంజయ్, అలాగే కాలిక యూత్ అసోసియేషన్ ప్రతినిధులు వేమునూరి మణితేజ, బాల్నే అఖిల్, విజయ్ కొండోజు, అదొండ వెంకటేష్, నీలం రామ్ ప్రసాద్, పున్నోజు వినయ్, శ్రీరామ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.