EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వాహనాల బ్యాటరీల దొంగ అరెస్ట్ రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలు స్వాధీనం..ఐదు కేసులు ఛేదించిన కేయూసీ పోలీసులు

    Author
    Posted By JANA CHARITRA
    | 20 Sep 2026, 06:59 AM | TELANGANA, వరంగల్
    వాహనాల బ్యాటరీల దొంగ అరెస్ట్ రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలు స్వాధీనం..ఐదు కేసులు ఛేదించిన కేయూసీ పోలీసులు

    *తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 19*
    హనుమకొండ: రాత్రివేళల్లో పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు,లారీల బ్యాటరీలను చోరీ చేస్తున్న నిందితుడిని కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుడి నుంచి సుమారు రూ.లక్ష విలువైన 16 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.కేయూసీ,మడికొండ,మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన ఐదు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.పోలీసుల వివరాల ప్రకారం..బాలసముద్రానికి చెందిన పస్తం అయిలు కుమార్(35)ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.రాత్రి వేళల్లో జవహర్‌కాలనీ,వడ్డేపల్లి,మిల్స్‌కాలనీ,మడికొండ ప్రాంతాల్లో రోడ్లపై పార్కింగ్ చేసిన ట్రాక్టర్లు,లారీలను గుర్తించి వాటి బ్యాటరీలను చోరీ చేసేవాడు.ఈ మేరకు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి.విచారణలో నిందితుడు నేరాలను అంగీకరించడంతో అతడి నుంచి 16 బ్యాటరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై గతంలోనూ పలు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.2012లో వరంగల్ బస్టాండ్‌లో సెల్‌ఫోన్ల చోరీకి సంబంధించి ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని,గతంలో మొత్తం 36 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.బ్యాటరీ చోరీ కేసులను సవాల్‌గా తీసుకుని త్వరితగతిన ఛేదించిన కేయూసీ ఇన్‌స్పెక్టర్ ఎస్.రవికుమార్,ఎస్‌ఐ కె.నవీన్‌కుమార్,క్రైమ్ సిబ్బంది అహ్మద్ పాషా,రాజశేఖర్‌లను హనుమకొండ ఏసీపీ నర్సింహారావు,సెంట్రల్‌జోన్ డీసీపీ ధార కవిత,వరంగల్ సీపీ ఎన్.శ్వేత ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.