EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవుడి మాన్యం భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Sep 2026, 08:41 PM | TELANGANA, వరంగల్
    దేవుడి మాన్యం భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలి

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి, సెప్టెంబర్ 21
    పర్వతగిరి మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి సంరక్షించాలని కోరుతూ దేవస్థానం సభ్యులు మండల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దేవస్థానానికి సంబంధించిన సర్వే నంబర్లు 932, 933, 934లో మొత్తం 4 ఎకరాల 5 గుంటల భూమి ఉండాల్సి ఉండగా, భూమిపై అనుమానం రావడంతో దేవస్థానం సభ్యులు ఇటీవల కొలతలు వేయించినట్లు తెలిపారు. కొలతల్లో 3 ఎకరాల 22 గుంటల భూమి మాత్రమే ఉన్నట్లు తేలిందని, మిగిలిన 23 గుంటల భూమి కనిపించకపోవడంతో కొందరు వ్యక్తులు ఆక్రమించి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. దేవస్థానానికి చెందిన మాన్యం భూమి కావడంతో అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి, అసలు విస్తీర్ణాన్ని నిర్ధారించి, భూమికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలని వారు ప్రజావాణిలో కోరారు. దేవస్థానం భూమిని రక్షించేందుకు రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల స్వామి దేవస్థానం సభ్యులు, వేణుగోపాల స్వామి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.