EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మద్యపాన నిషేధ అములుకై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధం

    Author
    Posted By JANA CHARITRA
    | 22 Sep 2026, 10:54 PM | TELANGANA, వరంగల్
    మద్యపాన నిషేధ అములుకై మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలకు సిద్ధం

    అక్టోబర్ రెండో తేదీ నుండి మద్యపాన నిషేధ అమలుకై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయటంతో ప్రారంభం

    వంగూరి ఆనందరావు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వరంగల్ జిల్లా ఇంచార్జ్
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో దళిత కాలనీలో
    మహాజన మహిళా మండలి మరియు మాదిగ మహిళా సమైక్య కమిటీల ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో మద్యపానం నిషేధం అమలుకై అక్టోబర్ రెండవ తేదీన జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మాదిగ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఐశ్వర్య మాదిగ అధ్యక్షతన జరిగిన మహిళా సదస్సులో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరు ఆనందరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు అంటే అది కేవలం మద్యపానం వల్లనేనని ఈ మద్యపానం వల్ల పీడత వర్గాల ప్రజలు దినసరి ఆదాయంలో నూటికి అరవై 70 శాతం మధ్యాహ్నంకే ఖర్చు అవుతుందని ఈ మధ్యపాన వ్యసనం వల్ల వారి కుటుంబాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని తెలియజేసినారు దేశంలో ముఖ్యంగా అతి చిన్న వయసులోనే యువకులు మద్యానికి బానిసలై అర్ధాంతరంగా వారి జీవితాలను ముగించుకుంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో వితంతువులుగా వారు భార్యలు కుటుంబ పోషణలు పోషించుకోలేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని మద్యం వల్ల ఆక్సిడెంట్లు జరగటం గానీ మద్యం మత్తులోనే హత్యలుగాని అత్యాచారాలు గాని జరుగుతున్నాయని ఇటువంటి ప్రధాన పరిణామాలకు కారణమైనటువంటి మద్యాన్ని దేశంలో పూర్తిస్థాయిలో నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆనందరావు మాదిగ తెలియజేసినారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోరి ప్రారంభమవుతున్న ఈ ఉద్యమంలో కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకతీతంగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమావేశంలో పర్వతగిరి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బొట్ల కుమార్ మాదిగ ఎం ఎస్ పి మండల ప్రధాన కార్యదర్శి చిన్నపల్లి వెంకన్న మాదిగ ఎమ్మార్పీఎస్ పర్వతగిరి టౌన్ అధ్యక్షులు చిన్నపల్లి శ్రీనివాస్ మాదిగ మాదిగ మహిళా సమాఖ్య టౌన్ అధ్యక్షురాలు ఐశ్వర్య మాదిగ అధికార ప్రతినిధి హర్షం సబిత మాదిగ ఉపాధ్యక్షురాలు బొట్ల మంగమ్మ మాదిగ ప్రధాన కార్యదర్శి సంకినేని దుర్గా మాదిగ కార్యదర్శిగా చిన్నపల్లి నవ్య మాదిగ సహాయ కార్యదర్శిగా సంకినేని ధరణి మాదిగ మరియు సింగారపు చంద్రమ్మ బొట్ల మరియమ్మ బొట్ల సువర్ణ బొట్ల అను జిల్లా శాంతమ్మ చిర్రా వెంకటమ్మ సంకినేని పద్మ బొట్ల రాణి తదితరులు పాల్గొన్నారు