EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల నూతన కమిటీ సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 04:53 PM | TELANGANA, వరంగల్
    విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల నూతన కమిటీ సమావేశం

    హనుమకొండ: తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ–వరంగల్ జిల్లాలకు నూతనంగా ఎంపికైన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులతో పాటు పలువురు విశ్వబ్రాహ్మణ జర్నలిస్టులు సమావేశంలో పాల్గొన్నారు.
    సమావేశంలో సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి, కొత్తగా చేరిన సభ్యులను హనుమకొండ జిల్లా విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం సంఘం భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి, సభ్యుల సంక్షేమానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
    విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సభ్యులకు సూచించారు. సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
    రాబోయే రోజుల్లో విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అభ్యున్నతికి ఉపయోగపడే పలు కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని నూతన కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.