EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 06:39 PM | TELANGANA, వరంగల్
    వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ

    వర్ధన్నపేట: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు.

    వర్ధన్నపేటలోని శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు, యువ నాయకులు ఆరూరి విశాల్ పాల్గొని లబ్ధిదారులకు ఎగ్ కార్డులను అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిగుడ్డులో నాణ్యమైన ప్రోటీన్‌తో పాటు శరీరానికి అవసరమైన పలు విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని తెలిపారు. పిల్లల ఎదుగుదలకు, కండరాల అభివృద్ధికి, శరీరానికి అవసరమైన శక్తిని అందించేందుకు కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందుబాటు ధరలో అధిక పోషక విలువలను అందించే ఆహారంగా కోడిగుడ్డును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    ఇవి కూడా చదవండి

    కార్యక్రమంలో ఎన్‌ఈసీసీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎజిల్ కుమార్, రాజీవ్, కోళ్ల రైతులు సుబ్రహ్మణ్యం, దిలీప్ రావుతో పాటు స్థానిక నాయకులు, పౌల్ట్రీ రైతులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.