EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ పర్యటన విజయవంతం

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 07:56 PM | TELANGANA, వరంగల్
    కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ పర్యటన విజయవంతం

    *పోలీసుల భారీ గేట్లను దూసుకుంటూ వెళ్లిన బిఆర్ఎస్ శ్రేణులు.*

    *కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు...*
    జన చరిత్ర న్యూస్ ( వర్ధన్నపేట) భూపాలపల్లి జిల్లా
    కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి..
    కాంగ్రెస్ ఎక్కడ ఉంటే.. అక్కడ కరెంట్ ఉండదు.
    కాంగ్రెస్ కావాలా? కరెంట్ కావాలా? అని మేము ముందే చెప్పాం. మేం చెప్పిందే ఇప్పుడు యథాతథంగా జరుగుతుంది..
    కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చాం.. ఇప్పుడు కరెంట్ కోతలతో రాష్ట్రం మొత్తం అల్లాడిపోతోంది...
    కాంగ్రెస్ చేసిన బొగ్గు స్కామ్ వల్లే నేడు రాష్ట్రంలో బొగ్గు దొరకక కరెంటు కష్టాలు మొదలయ్యాయి.
    జెన్కోకు థర్డ్ గ్రేడ్ నాసిరకం బొగ్గును సరఫరా చేయడం వల్ల రాష్ట్రానికి ఏకంగా రూ. 2,900 కోట్ల నష్టం వాటిల్లింది.
    బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చెల్పూర్, జయశంకర్ భూపాలపల్లిలో గల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (TG-GENCO) ను పరిశీలించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ .
    ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి తాటికొండ రాజయ్య మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.