EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రవీంద్ర భారతి లో జరిగే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో "స్టేట్ వైస్ చైర్మన్ "గా చోటు దక్కించుకున్న రాచకొండ రమేష్ బాబు

    Author
    Posted By AKULA MADHU
    | 24 Sep 2026, 09:47 PM |
    రవీంద్ర భారతి లో జరిగే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో "స్టేట్ వైస్ చైర్మన్ "గా చోటు దక్కించుకున్న రాచకొండ రమేష్ బాబు

    నారాయణపురం : మండల కేంద్రానికి చెందిన రాచకొండ రమేష్ బాబు శనివారం రవీంద్ర భారతిలో జరగబోయే చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో వీరనారి చాకలి ఐలమ్మ ఉత్సవ కమిటీ " స్టేట్ వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించింది.
    తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 131 జయంతి కార్యక్రమం సందర్భంగా రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి నాకు చోటు దక్కడం సంతోషంగా ఉందని రమేష్ బాబు తెలిపారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో, వారి ఆశయ సాధన కోసం ఈ వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి రాచకొండ రమేష్ స్టేట్ వైస్ చైర్మన్ గా చోటు దక్కడం పట్ల పలువురు స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు మండల స్థాయిలో ఉన్న వివిధ నాయకులు అభినందనలు తెలుపుతున్నారు.