EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినయ్ భాస్కర్‌ను పరామర్శించిన పల్లా, సత్యవతి, తక్కళ్లపల్లి

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Sep 2026, 05:35 PM | TELANGANA, వరంగల్
    వినయ్ భాస్కర్‌ను పరామర్శించిన పల్లా, సత్యవతి, తక్కళ్లపల్లి

    హనుమకొండ: ఎంజీఎం ఆసుపత్రి సందర్శన సందర్భంగా పోలీసుల చర్యలో గాయపడిన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఇతర ముఖ్య నాయకులు పరామర్శించారు.

    వడ్డేపల్లిలోని వినయ్ భాస్కర్ నివాసానికి వెళ్లిన నాయకులు ఆయనను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల పరిస్థితి, వైద్య సౌకర్యాలను పరిశీలించేందుకు ప్రజల తరఫున వెళ్లిన వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని వారు ఖండించారు.

    ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తున్న వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని నాయకులు ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్ష నేతలపై పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని వారు విమర్శించారు. వినయ్ భాస్కర్‌పై జరిగిన ఘటనకు బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.