EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రాష్ట్ర నిర్వహణ కమిటీ ఏర్పాటు వైస్ చైర్మన్‌గా చిప్ప వెంకటేశ్వర్లు నేత నియామకం

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Sep 2026, 05:40 PM | TELANGANA, వరంగల్
    కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి  రాష్ట్ర నిర్వహణ కమిటీ ఏర్పాటు  వైస్ చైర్మన్‌గా చిప్ప వెంకటేశ్వర్లు నేత నియామకం

    వరంగల్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
    ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఈ నెల 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్నారు.

    జయంతి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చిప్ప వెంకటేశ్వర్లు నేతను వైస్ చైర్మన్‌గా నియమించారు.

    వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం తన బాధ్యతగా చిప్ప వెంకటేశ్వర్లు నేత తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    కృతజ్ఞతలు
    తనపై నమ్మకంతో రాష్ట్ర నిర్వహణ కమిటీలో కీలక బాధ్యత అప్పగించిన మాజీ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నిర్వహణ కమిటీ చైర్మన్ మరియు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్‌కు చిప్ప వెంకటేశ్వర్లు నేత కృతజ్ఞతలు తెలిపారు.
    కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు పద్మశాలి సమాజం, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.