EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీరత్‌-ఉన్‌-నబీ క్విజ్‌ విజేతలకు బహుమతులు

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Sep 2026, 07:20 PM | TELANGANA
    సీరత్‌-ఉన్‌-నబీ క్విజ్‌ విజేతలకు బహుమతులు

    *తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 25*
    జనగామ: జమీయత్‌ ఉలమా జనగామ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీలో నిర్వహించిన సీరత్‌-ఉన్‌-నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లామిక్‌ క్విజ్‌–2026 బహుమతుల ప్రదానోత్సవం శుక్రవారం పాఠశాల మసీదులో నిర్వహించారు.జమీయత్‌ ఉలమా జనగామ అధ్యక్షుడు మౌలానా అబ్దుర్‌ రహ్మాన్‌ సబీలీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్విజ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు,పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు,సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా క్విజ్‌ కన్వీనర్‌ మహమ్మద్‌ ఖ్వాజా ముజ్తహిదుద్దీన్‌ మాట్లాడుతూ మతపరమైన విద్య,సమాజ సంస్కరణ,యువతలో అవగాహన పెంపొందించేందుకు జమీయత్‌ ఉలమా కృషి చేస్తోందన్నారు.మౌలానా షాకిర్‌ హుస్సేన్‌ ఖాసిమీ మాట్లాడుతూ విద్యార్థుల్లో దైవభక్తి,ఇస్లామిక్‌ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు క్విజ్‌ నిర్వహించినట్లు తెలిపారు.అడ్వకేట్‌ మహమ్మద్‌ జమాల్‌ షరీఫ్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఖురాన్‌ పఠనంతో పాటు అరబిక్‌ భాషను నేర్చుకుని మతపరమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలలో మతపరమైన విద్య అభివృద్ధి కోసం జమీయత్‌ ఉలమా చేసిన కృషి ఫలితంగా అరబిక్‌ ఉపాధ్యాయుల నియామకం జరిగిందని మౌలానా అబ్దుర్‌ రహ్మాన్‌ సబీలీ తెలిపారు.పాఠశాల ప్రిన్సిపాల్‌ కుమార్‌స్వామి మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధనలు సమస్త మానవాళికి మార్గదర్శకమన్నారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ మహమ్మద్‌ సమద్‌,మాజీ కో-ఆప్షన్‌ మెంబర్‌ మసీ ఉర్‌ రహ్మాన్‌ జాకిర్‌,హాఫిజ్‌ అబ్దుల్‌ మన్నాన్‌,హాఫిజ్‌ అబ్దుల్‌ జవాద్‌,డాక్టర్‌ బుష్రా,సల్మాన్‌ ఖుర్షీద్‌,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.