EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Sep 2026, 06:30 PM | TELANGANA, వరంగల్
    వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాన్ని పర్యవేక్షించిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య

    వయో వృద్ధుల వారోత్సవాల లో భాగంగా అన్ని వృద్దాశ్రమ ములలో మెడికల్ క్యాంప్ లను నిర్వహించడం జరిగింది అందులో భాగం గా ఈ రోజు పెద్దమ్మగడ్డ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని స్వయం కృషి మహిళా సొసైటీలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, సహృదయ వృద్దాశ్రమమును అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మదన్ మోహన్ లు పర్యవేక్షించారు.
    ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు నిర్వహించిన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, అవసరమైన మందుల పంపిణీ తదితర అంశాలను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. వృద్ధుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన వైద్య సేవలను నిరంతరం అందించాలని సిబ్బందికి సూచించారు. వృద్ధుల్లో సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించాలని తెలిపారు.
    ఈ కార్యక్రమంలలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ డాక్టర్ విజయరెడ్డి,డాక్టర్ సృజన, హెచ్‌ఈఓ సాయి ని వెంకటేశ్వర్లు, ప్రతాపగిరి ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు హరిప్రసాద్, మధు ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు.