EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులుకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులు వరంగల్: సహకార సంఘాల సృష్టికర్త, చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Sep 2026, 05:40 PM | TELANGANA, వరంగల్
    కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులుకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులు  వరంగల్: సహకార సంఘాల సృష్టికర్త, చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ

    కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులు

    వరంగల్: సహకార సంఘాల సృష్టికర్త, చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో చిప్ప వెంకటేశ్వర్లు నేత పిలుపు మేరకు ఎలుగం సాంబయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి నాయకులు సుమారు 200 ఈ సమావేశం లో పాల్గొన్నారు.
    పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ముఖ్య అతిథులుగా బిసి శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మాత్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు, మాజీ శాసనసభ్యులు ఈరవత్రి అనిల్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, వైస్ చైర్మన్ జక్కని అనిత, బిసి కమిషన్ మెంబెర్ రాపోలు జయప్రకాష్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి, వల్లకాటి రాజ్ కుమార్, జాతీయ అధ్యక్షులు కందకట్ల స్వామి, మాజీ ఆప్కో చైర్మన్ గడ్డం జగన్నాథం, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, సంగిశెట్టి జగదీశ్వర్, మచ్చ వరలక్ష్మి, బోగ జగదీష్, కోనంపేట నర్సింగ్, అంకం శ్రీనివాస్, మసన రవికుమార్, చెరుపల్లి సీతారాములు, పాల్గొన్నారు.
    ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వక్తలు ఆయన చేనేత రంగానికి చేసిన సేవలను గుర్తు చేసినారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో చేనేత రంగానికి చేయూత నిస్తూ రుణమాఫీ చెయ్యడం జరిగింది అని, నేతన్న భీమా చనిపోయిన ప్రతి చేనేత కార్మికునికి 5 లక్షల రూపాయలు భీమా ఇస్తున్నట్లు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో చిప్ప వెంకటేశ్వర్లు, ఎలుగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, దువ్వల రాజేందర్, ఎలుగం రవిరాజ్, వెంకటమల్లు, చిన్న వీరస్వామి, వలుస లక్ష్మీనారాయణ, బూర వేణుమాధవ్, ఓం ప్రకాష్, శ్రీనివాస్, మాటేటి రాములు, కూరపాటి సంపత్, గుత్తికొండ తిరుపతి, దాసరి బిక్షపతి, కుమారస్వామి, కందకట్ల సంజీవ, రమేష్, పరమాత్మ, కూచన సారయ్య, బాసానికి ప్రకాష్, దువ్వల కృష్ణ తేజ, మాచర్ల రమేష్, మాచర్ల రవీందర్, వెల్దండి చంద్రబోస్, బొద్దుల రాజు, పెంట రంజిత్, మేరుగు సంపత్, దుబాసి రాజు,
    ఎలుగం ధనలక్ష్మి, సరిత, వావిలాల భాగ్యమ్మ, గడ్డం నర్మద తదితరులు పాల్గొన్నారు.