EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లు విధుల్లో సమయపాలన పాటించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Sep 2026, 08:51 PM | TELANGANA, వరంగల్
    ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లు విధుల్లో సమయపాలన పాటించాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజా రెడ్డి

    రాయపర్తి (వర్ధన్నపేట) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్లతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఓపీ సేవలను మరింత విస్తృతం చేసి, ఓపీ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.

    జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఇండికేటర్లను మెరుగుపరచడానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ఓ.పి.,గర్భిణీ సేవలు, ఇమ్యూనైజేషన్, 14 సంవత్సరాల బాలికలకు ఎచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి, అర్హులైన బాలికలందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    సమయపాలన పాటించని సిబ్బంది, నిర్దేశించిన పనితీరు లక్ష్యాలను సాధించని వారి పనితీరును మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.

    సంబంధిత వైద్య అధికారులు మరియు డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు తమ పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఎంఎల్‌హెచ్‌పీలు, సూపర్‌వైజర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.

    ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఆర్. రాజమౌళి, రాయపర్తి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అరుణ్ చంద్ర, ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు, సూపర్‌వైజర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.