EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్టోబర్ 3న ఇనామ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ

    Author
    Posted By JANA CHARITRA
    | 27 Sep 2026, 09:37 PM | TELANGANA, వరంగల్
    అక్టోబర్ 3న ఇనామ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ

    ఎన్నికల ప్రక్రియ–మైనారిటీల పరిస్థితి పై చర్చ..రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సన్నాహాలపై చర్చ*

    *తెలంగాణ /వరంగల్/హన్మకొండ,సెప్టెంబర్ 23*

    ఇండియన్ నేషనలిస్ట్ మూవ్‌మెంట్(ఇనామ్)ఆధ్వర్యంలో అక్టోబర్ 3న నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించిన సన్నాహాలపై హన్మకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ముస్లిం,క్రైస్తవ,సిక్కు మత పెద్దలు,మైనారిటీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.ఇనామ్ జాతీయ అధ్యక్షుడు దివంగత మాతూరి కృష్ణ ప్రసాద్ స్మృతిలో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటలకు హన్మకొండ రైపురాలోని జకారియా ఫంక్షన్ హాల్‌లో ‘భారత ఎన్నికల ప్రక్రియ మరియు మైనారిటీల పరిస్థితి’ అనే అంశంపై బహిరంగ సభ జరగనుంది.సమావేశంలో మాతూరి కృష్ణ ప్రసాద్ మృతిపట్ల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నవారు సంతాపం వ్యక్తం చేసి,ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.న్యాయం,మైనారిటీల రాజ్యాంగ హక్కుల కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాలపై చర్చ అవసరమని పేర్కొంటూ,బహిరంగ సభను విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.బహిరంగ సభకు రాజకీయ,ఆర్థిక వ్యాఖ్యాత,రచయిత,తెహ్రీక్ ముస్లిం షబన్‌కు చెందిన ముస్తాఖ్ మాలిక్,పరకాల ప్రభాకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్నారు.రౌండ్ టేబుల్ సమావేశంలో ఇనామ్ జాతీయ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ మజీద్,జాతీయ కోఆర్డినేటర్ అయూబ్ మహ్మద్,జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ అలీ జుబైర్,రీజినల్ ప్రెసిడెంట్ మహమ్మద్ పర్వేజ్,అహ్సన్ మహమ్మద్ బాబర్,ఖ్వాజా అస్లాం,వరంగల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఫసిహుద్దీన్ ఖాస్మీ,అబ్దుల్ సుభాన్,మౌలానా మునావర్,హఫీజ్ అబ్దుల్ ముఖిత్,జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధి సయ్యద్ దస్తగీర్,ఓం బ్రహ్మం,రాజ్ మహమ్మద్,డాక్టర్ ముజాహిద్ ఇర్ఫాన్,సైఫుల్లా ఖలీద్,మాజీ కార్పొరేటర్ బోడా డిన్న,బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు నయీమ్,అబ్దుల్ సమద్,సోషల్ వర్కర్ అజహర్,మహమ్మద్ తౌసీఫ్,సయ్యద్ అస్లాం,ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ పాస్టర్ జోసెఫ్,భారత మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్‌ఎస్,కాంగ్రెస్,ఎంసీపీఐ,సీపీఐ,డీఎస్‌యూ తదితర పార్టీలకు చెందిన ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

    ఇవి కూడా చదవండి