EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కలెక్టరేట్ సిద్ధంగా ఉన్నా ప్రారంభించలేని ప్రభుత్వం.. కుటుంబ పదవులపై ఉన్న శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజలపై లేదా?” — ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Sep 2026, 10:48 PM | TELANGANA, వరంగల్
    కలెక్టరేట్ సిద్ధంగా ఉన్నా ప్రారంభించలేని ప్రభుత్వం.. కుటుంబ పదవులపై ఉన్న శ్రద్ధ వరంగల్ తూర్పు ప్రజలపై లేదా?” — ఎర్రబెల్లి ప్రదీప్ రావు

    వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో ఓ సిటీ క్యాంపు కార్యాలయం నుంచి నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసనలో భాగంగా బూడిద గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసి నిరసన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ.. భవనం నిర్మాణం పూర్తయినా నూతన వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా వరంగల్‌లో ఉన్నప్పుడు ప్రజలు ప్రతి ప్రభుత్వ పనికోసం హన్మకొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని నిలదీశారు. ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియక ప్రజలు తిరగాల్సి వస్తోందని, తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా హన్మకొండ చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

    “కుటుంబంలో ఎవరికి ఏ పదవి రావాలి.. ఎవరు ఎమ్మెల్సీ కావాలి.. ఎవరు ఎమ్మెల్యే కావాలి అనే ఆరాటం ఉంటే, మీ కుటుంబానికి ఎన్ని పదవులు కావాలో అన్ని పదవులు తీసుకోండి.. చివరికి ముఖ్యమంత్రి పదవి కూడా మీరే తీసుకోండి. కానీ మిమ్మల్ని గెలిపించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తున్నారు?” అని ప్రదీప్ రావు ప్రశ్నించారు.

    “నెలలో కనీసం 20 రోజులైనా తూర్పు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు వినే బాధ్యత మీకు లేదా? అధికారంలో ఉన్నప్పుడు పదవులు కావాలి.. కానీ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన సమయానికి ప్రజలకు అందుబాటులో ఉండరా?” ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో మీ యొక్క క్యాంపు కార్యాలయాలను ముట్టడిస్తామని అని హెచ్చరించారు.

    ఇవి కూడా చదవండి

    “మంత్రి పదవి ఉన్నా ప్రజలకు ఏం చేయలేదు?

    కాకతీయుల చారిత్రక రాజధాని అయిన వరంగల్‌లో నిర్మించిన నూతన కలెక్టరేట్ ముందు కాకతీయ కీర్తి తోరణం లేకపోవడం కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీసే అంశమన్నారు. కలెక్టరేట్‌ను వెంటనే ప్రారంభించి, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలను వరంగల్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    “పదవుల కోసం రాజకీయాలు చేయడం కాదు.. ప్రజల కోసం పనిచేయండి. వరంగల్ తూర్పు ప్రజలకు అందుబాటులోకి రండి. పూర్తయిన కలెక్టరేట్‌ను వెంటనే ప్రారంభించండి. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు హన్మకొండకు తిప్పుతారు?” అని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించారు.

    వీరితోపాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్, జలగం రంజిత్, సీనియర్ నాయకులు కుసుమ సతీష్, వంగాల సమ్మిరెడ్డి, రత్నం సతీష్ షా, తాజా మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, గోకుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు తదితర రాష్ట్ర జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు