EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం

    Author
    Posted By JANA CHARITRA
    | 29 Sep 2026, 10:49 PM | TELANGANA, వరంగల్
    వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో బేతి అశోక్ బాబుకు ఘన సన్మానం

    వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు చెందిన వర్తక సంఘం, పరపతి సంఘం, కమిషన్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో నూతనంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బేతి అశోక్ బాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

    లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌కు హోల్సేల్ వ్యాపారస్తుడు మ సహచర నాయకుడు బేతి అశోక్ బాబు అంచెలంచెలుగా ఎదుగుతూ సామాజిక సేవా రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకొని, వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం పట్ల మార్కెట్ వర్గాలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు చెందిన వ్యక్తి జిల్లా స్థాయిలో కీలకమైన సేవా సంస్థకు నాయకత్వం వహించడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

    బేతి అశోక్ బాబు వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ సెక్రటరీగా 16 సంవత్సరాలు సేవలు అందించినారు. అలాగే కూరగాయల మార్కెట్ పరపతి సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, వరంగల్ పద్మశాలి జిల్లా యువజన అధ్యక్షుడిగా చేయూత స్వచ్ఛంద సేవ సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ వివిధ రంగాల్లో తన సేవలను కొనసాగిస్తున్నారు. ప్రజా సేవ, సంఘటిత నాయకత్వం, సామాజిక బాధ్యతలతో ఆయన ముందుకు సాగుతున్నారు.

    ఇవి కూడా చదవండి

    రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా పేదలకు, బాధితులకు, ఆపదలో ఉన్న వారికి మరింత మెరుగైన సేవలు అందించాలని మార్కెట్ వర్గాలు ఆకాంక్షించాయి. సమాజ సేవలో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అభినందనలు తెలియజేశాయి.

    ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి శ్రీనివాస్, మల్లూరి బాబురావు, సోలా శ్రీనివాస్, దౌలత్ బాజీ, రవికాసర్ల రాజు, రేపల్లె రాజు, శీలం సత్యనారాయణ, దేవరపల్లి భద్రయ్య, వలిశెట్టి మురళి, ఎస్కే అమర్, గుర్రాల మోహన్, బేతి రాజు, పరిషవీరన్న, కొండా హరి, నల్లదిగల కుమార్, బిజ్జా శ్రీహరి, జోగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.