EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీస్ అమరవీరుల త్యాగాలపై విద్యార్థులకు అవగాహన సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Oct 2026, 07:48 AM | TELANGANA, వరంగల్
    పోలీస్ అమరవీరుల త్యాగాలపై విద్యార్థులకు అవగాహన  సెయింట్ మేరీస్ పాఠశాల విద్యార్థులకు పోలీస్ స్టేషన్ సందర్శన

    హసన్‌పర్తి: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హసన్‌పర్తి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సందర్శన (ఓపెన్ హౌస్) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఏ. మహేందర్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. పోలీసుల విధులు, ప్రజల రక్షణ కోసం వారు చేపట్టే చర్యలను ప్రత్యక్షంగా తెలియజేశారు.

    దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించి, వారిలో దేశభక్తి, సామాజిక బాధ్యతాభావాన్ని పెంపొందించారు. అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. మహిళలు, బాలల రక్షణ కోసం అమలులో ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమంలో సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.