EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీ.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పర్వతగిరి మండల సీనియర్ క్యాడర* *గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గారు మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Oct 2026, 07:51 AM | TELANGANA, వరంగల్
    బీ.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పర్వతగిరి మండల సీనియర్ క్యాడర*    *గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గారు మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్

    బీ.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పర్వతగిరి మండల సీనియర్ క్యాడర*

    *గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గారు మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు*

    నేడు పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో బీ.ఆర్.ఎస్ గూటికి చేరారు.

    చేరిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ జూలపెల్లి గంగాధర్ రావు, ఇండిపెండెంట్ సర్పంచ్ కాంటెస్ట్ అభ్యర్థి సింగారపు రమేష్,సీనియర్ నాయకులు జూల్లపెల్లి సురేందర్ రావు,జూల్లపెల్లి సోమేశ్వర్ రావు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు కాంటెమ్ సుధాకర్, మైనార్టీ మండల నాయకురాలు షేక్ సుల్తాన, మాజీ నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు జిల్లా శ్రీనివాస్, మండల మాజీ మైనార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా, మాజీ యూత్ వైస్ ప్రెసిడెంట్ చింతకుంట్ల రంజిత్, మాజీ వార్డు సభ్యులు చిరుకొండ వీరస్వామి,ముదిదేన దేవేందర్, కొలుగూరి సంతోష్ రావు, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, బొట్ల అనిల్ బీ.ఆర్.ఎస్ పార్టీ లోకి చేరారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్బంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు మాట్లాడుతూ

    మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అరిగోస పడుతున్నారు, రేవంత్ రెడ్డి అబద్దాల మాటలతోనే పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు పరిచడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా కేవలం 6 గంటలకే పరిమితమైంది అన్నారు. రైతుల బాగు కోసం ఆలోచించని రైతు ద్రోహి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.

    రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారిపై నమ్మకంతో గతంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు ఫలితంగా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రనికి బీ ఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అన్నారు. పార్టీలో చేరిన ప్రతీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయాలని, సమన్వయంతో ముందుకెళ్లాలని దశానిర్దేశం చేశారు. నేడు పార్టీలో చేరిన వారికి పార్టీలో సముచిత స్థానం గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ ఎం. మనోజ్ గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు బోయినపల్లి యుగంధర్ రావు, పుట్టపురం ఏకాంతం గౌడ్, మాజీ మండల అధ్యక్షులు రంగు కుమార్, మండల మాజీ రైతు బంధు అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాస్,సీనియర్ నాయకులు చీమల బిక్షపతి, మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు సర్పంచులు ఏర్పుల శ్రీనివాస్, డెక్క సునీత కుమారస్వామి, మాజీ ప్రజాప్రతినిధులు,మండల సీనియర్ గ్రామ మాజీ శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.