EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Nov 2026, 08:02 AM | TELANGANA, వరంగల్
    ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన

    సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన
    ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన

    ములుగు: ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ములుగు పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద సందేశాలు, లింకులు, డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలపై అవగాహన కల్పించారు.

    ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద కాల్స్, సందేశాలు, లింకుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు అడిగినంత మాత్రాన ఓటీపీ, ఏటీఎం పిన్, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించకూడదని స్పష్టం చేశారు. అత్యవసరంగా డబ్బులు పంపాలని ఒత్తిడి చేసే వ్యక్తుల మాటలు నమ్మకుండా ముందుగా నిజానిజాలను ధృవీకరించుకోవాలని తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, అందువల్ల ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా సందేశం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఆగాలి.. ఆలోచించాలి.. ధృవీకరించాలి.. అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.

    ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయ నంబర్ 1930కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.

    ఈ కార్యక్రమంలో ములుగు సీఐ దారం సురేష్, ములుగు స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెంకటేష్, వెంకటాపురం ఎస్‌హెచ్‌ఓ చల్లా రాజు, ఎస్‌ఐలు బుట్ట చంద్రశేఖర్, రుచిత్ర, సాయికృష్ణ, సైబర్ భద్రత విభాగం ఇన్‌చార్జి కానిస్టేబుల్ శ్రీకాంత్, మున్సిపల్ కౌన్సిలర్ పావని, విద్యార్థినీ విద్యార్థులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైబర్ నేరాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆగి ఆలోచించి నిజానిజాలను ధృవీకరించిన తర్వాతే స్పందించాలని కోరారు.