EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు మీ మూడేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి..బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోట్ల మధు డిమాండ్

    Author
    Posted By JANA CHARITRA
    | 01 Nov 2026, 08:06 AM | TELANGANA, వరంగల్
    కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు మీ మూడేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి..బిఆర్ఎస్ పార్టీ నాయకులు బోట్ల మధు డిమాండ్

    *కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే ముందు మీ మూడేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో చెప్పండి* ,*బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల మధు డిమాండ్**
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం రోజున విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోట్ల మధు మాట్లాడుతూ
    బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతుబంధు, ఏ కారణం చేతనైన రైతు మరణానిస్తే దినం ఎల్లకముందే 5లక్షల రైతుబీమా అందించం. పథకాలతో తెలంగాణ అభివృద్ధికి బాటలు వేశాం. రైతులకు సాగునీరు, పెట్టుబడి సాయం అందించాం.
    ప్రాజెక్టుల్లో తప్పులుంటే నిరూపించండి. విచారణ జరపండి. చట్టపరంగా చర్యలు తీసుకోండి. కానీ రాజకీయ కక్షతో తెలంగాణ రైతాంగానికి నీరు అందించక కరువు తీసుకొచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంమే,తెలంగాణ రైతులను,ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోరు.
    ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్‌ను కాదు.. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని!
    ఢిల్లీ పర్యటనల మీద ఉన్నా ద్యాస పాలన మీద లేదే?
    ప్రకృతి వైపరీత్యాన్ని అడ్డుపెట్టుకొని మీరు మాట్లాడుతున్న మాటలు మీ చేతకాని ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంనికి నిదర్శనం.
    కెసిఆర్ గారి ప్రభుత్వంలో రైతాంగం కోసం తెలంగాణ అభివృద్ధి కోసం దూరదృష్టితో అనేక ప్రాజెక్టుల నిర్మించడం వల్ల సాగునీరు త్రాగునీరు కావచ్చు ఆహార నిలవలు కావచ్చు ఉండటం వలెనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పరిపాలన కొనసాగించారు.ఒక చుక్క నీరు ఎత్తిపోయలేదు ప్రాజెక్టుల ద్వారా బీఆర్ఎస్ పాలనలో దండిగా సాగిన వ్యవసాయం నేడు ఎండిన పంటలతో గోసపడుతున్నది.
    బిఆర్ఎస్ పాలనలో సెకండ్ కాలంలో కూడా పోనీ కరెంట్, ఇప్పుడు విడుదలవారీగా ఇస్తున్న పరిస్థితి మీరు తీసుకు వచ్చింది కదా?
    బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చెరిపేయడం మీ వల్ల కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్‌కు ఉన్న స్థానాన్ని మీ రాజకీయ ఆరోపణలు మార్చలేవు గుర్తు పెట్టుకోండి.
    దేశంలో కాంగ్రెస్ పార్టీని పాతాళనికి నెట్టివేస్తున్నారు, మీ కంటికి కనిపించడం లేదా ?
    అభివృద్ధి మా చరిత్ర.. ప్రజల సంక్షేమం మా లక్ష్యం.. తెలంగాణ ఆత్మగౌరవం మా పోరాటం! అన్నారు