EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆర్థిక చేయూత

    Author
    Posted By amarender
    | 02 Nov 2026, 07:43 PM | Array
     నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆర్థిక చేయూత

    నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆర్థిక చేయూత

    వరంగల్: తండ్రిని కోల్పోయిన నిరుపేద విద్యార్థి చదువుకు రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకుంది.

    లిటిల్ మాస్టర్ హైస్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న కొంగ అరుష్‌కు ఏడాది విద్యా ఫీజు రూ.15,000లను రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ఆధ్వర్యంలో చెల్లించడం జరిగింది.

    ఇవి కూడా చదవండి

    విద్యార్థి తల్లి కొంగ చందన భర్త కోవిడ్ సమయంలో మరణించడంతో కుటుంబ బాధ్యతలను ఒంటరిగా నిర్వహిస్తూ, తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో రోటరీ క్లబ్‌ను ఆశ్రయించారు. దీనిపై వెంటనే స్పందించిన రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పూర్తి విద్యా ఫీజును చెల్లించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

    ఈ సందర్భంగా రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షుడు సోమ వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థి చదువుకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని, పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ , మాజీ అధ్యక్షులు ,ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు, మాట్లాడుతూ ఒక చిన్నారి చదువుకు అందించిన ఈ సహాయం అతని భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ సెక్రెటరీ నాయిని అనిల్, సుంకనపల్లి శ్రీనివాస్, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.