EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హోటల్ గదిలో పేకాట.. 8 మంది అరెస్ట్ రూ.55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

    Author
    Posted By amarender
    | 03 Nov 2026, 08:56 AM | Crime
    హోటల్ గదిలో పేకాట.. 8 మంది అరెస్ట్ రూ.55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

    పత్రికా ప్రకటన
    మట్వాడా పోలీస్ స్టేషన్ (టాస్క్ ఫోర్స్)
    తేదీ: 01.11.2026
    హోటల్ గదిలో ముక్కాట (తీన్ పత్తి) ఆడుతున్న 8 మంది జూదరుల అరెస్ట్ – రూ. 55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
    వరంగల్ (మట్వాడా):
    వరంగల్ ములుగు రోడ్డులోని బిల్వాయ్ హోటల్ గదిలో డబ్బులతో జూదం (తీన్ పత్తి) ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను మట్వాడా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
    సంఘటన వివరాలు:
    ఈ రోజు (01.11.2026) సాయంత్రం సుమారు 18:00 గంటల ప్రాంతంలో మట్వాడా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కె. కుమార్ తమ సిబ్బంది పిసి-2468 (టి. కళ్యాణ్ కుమార్), పిసి-3242 (బి. వినయ్), పిసి-3690 (డి. నాగరాజు) లతో కలసి ములుగు రోడ్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, బిల్వాయ్ హోటల్‌లోని 3వ అంతస్తులో ఉన్న రూమ్ నంబర్ 305లో కొందరు వ్యక్తులు డబ్బులతో తీన్ పత్తి (మూడు ముక్కల ఆట) ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందింది.
    వెంటనే ఎస్.ఐ. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, వరంగల్ ఎసిపి కార్యాలయం నుండి శోధన అనుమతి (C.No.1089/ACP/WGL/2026) పొందారు. అనంతరం ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో రాత్రి 19:00 గంటలకు హోటల్ గదిపై దాడి చేసి, జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
    అరెస్టు చేసిన నిందితుల వివరాలు:
    * గాడే రాజేందర్ (47), వృత్తి: గోల్డ్ వర్కర్, నివాసం: గిర్మాజీపేట, వరంగల్.
    * దుబాసి అనిల్ (39), వృత్తి: గోల్డ్ వర్కర్, నివాసం: కాశీబుగ్గ, వరంగల్.
    * బిల్ల శివకుమార్ (43), వృత్తి: గోల్డ్ వర్కర్, నివాసం: శివనగర్, వరంగల్.
    * బిల్ల శేఖర్ (35), వృత్తి: కార్పెంటర్, నివాసం: అలంకార్, హన్మకొండ.
    * కూకొండ వేణు (49), వృత్తి: గోల్డ్ స్మిత్, నివాసం: ఎస్.ఆర్.ఆర్ తోట, వరంగల్.
    * తింగిల్కారి మహేష్ (33), వృత్తి: గోల్డ్ షాప్ వర్కర్, నివాసం: కరీమాబాద్, వరంగల్.
    * గడ్డం రాజు (46), వృత్తి: గోల్డ్ వర్కర్, నివాసం: ఎస్.ఆర్.ఆర్ తోట, వరంగల్.
    * నరిశెట్టి చిరంజీవి (42), వృత్తి: గోల్డ్ షాప్ వర్కర్, నివాసం: కాశీబుగ్గ, వరంగల్.
    స్వాధీనం చేసుకున్న సొత్తు:
    * నగదు: రూ. 55,280/- (పందెంలో ఉన్న మరియు నిందితుల వద్ద ఉన్న నగదు)
    * ఆట సామగ్రి: 104 పేకాట కార్డులు
    * మొబైల్ ఫోన్లు: 8 స్మార్ట్‌ఫోన్లు (వన్ ప్లస్-2, రియల్‌మీ-2, శామ్‌సంగ్-1, వివో-1, ఐకూ-1, రెడ్‌మీ-1)
    * ద్విచక్ర వాహనాలు (5):
    * TS 03 EV 4252 (హీరో గ్లామర్)
    * TG 24 H 6616 (ఎథర్)
    * TS 03 EJ 3448 (హీరో గ్లామర్)
    * TS 02 EG 2775 (హీరో గ్లామర్)
    * TS 24 J 1998 (రాయల్ ఎన్‌ఫీల్డ్)
    సదరు నిందితులపై తెలంగాణ గేమింగ్ చట్టం (TS Gaming Act) సెక్షన్ 3, 4 కింద Cr.No. 611/2026 నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచడం జరుగుతుందని మట్వాడా ఎస్.ఐ. తెలిపారు.
    ఇట్లు,
    సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,
    మట్వాడా పోలీస్ స్టేషన్.

    హోటల్ గదిలో పేకాట.. 8 మంది అరెస్ట్ రూ.55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం - Additional Image