EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయం లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

    Author
    Posted By amarender
    | 03 Nov 2026, 07:56 PM | TELANGANA
    ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయం లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*

    *ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయం లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*


    మంగళవారం రోజున ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ రవీంద్ర, సూపరిండెంట్ ఇంజనీర్ సివిల్ టి.వి రావు, సూపరిండెంట్ ఇంజనీర్ 400కేవి శ్రీనివాసులు మరియు విశిష్ట అతిథులుగా డిఇ వరంగల్ శ్రీనివాస్ రావు, డిఇ జనగాం సుధాకర్ రావు, డిఇ ఏంఆర్టి రాజు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటీవల విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ ఇంజనీర్లు ముఖ్యపాత్ర వహిస్తూ ఉద్యోగులంతా కలిసికట్టుగా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక వహించారని తెలియజేస్తూ ఇంజనీర్ల కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ నరేష్ మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్.సి భారత్ కుమార్ మాట్లాడుతూ అసిస్టెంట్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉందని మరియు విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగుల సమస్యల విషయంలో మేనేజ్మెంట్ పెద్దపీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి టీజీపిఈఏ నాయకులు ఏడిఈ కుమారస్వామి, ఏడిఈ రాజ్ కుమార్,టిఎస్ఈఏఈఏ అడిషనల్ బ్యాంక్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు,ట్రెసరర్ సంజయ్ రెడ్డి,మణికంఠ, రుబియా బాను,కళ్యాణి మరియు తదితరులు పాల్గొన్నారు.