EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    Author
    Posted By JANA CHARITRA
    | 04 Nov 2026, 07:18 PM | TELANGANA, వరంగల్
    అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ఒకరు అరెస్ట్‌.. తుఫాన్ వాహనం స్వాధీనం

    ఆత్మకూరు: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 18 క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు బియ్యం తరలించేందుకు ఉపయోగించిన తుఫాన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

    విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గూడెప్పాడ్ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న భోజ్జం బాను చందర్ (35)ను అదుపులోకి తీసుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    నిందితుడు హనుమకొండలోని గొల్లపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో నివాసం ఉంటూ, రంగయ్యపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని సిర్వంచకు విక్రయించేందుకు 50 కిలోల చొప్పున ఉన్న 36 సంచుల్లో మొత్తం 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తుఫాన్ వాహనం (ఏపీ 22 డబ్ల్యూ 2044)లో తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

    పట్టుబడిన రేషన్ బియ్యం విలువ రూ.54 వేలుగా అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని తదుపరి చర్యల నిమిత్తం ఆత్మకూరు పోలీసులకు అప్పగించారు.

    ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఏ. మధుసూదన్, ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్సై వీరస్వామి, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.