EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి*

    Author
    Posted By Gade Krishna
    | 04 Nov 2026, 08:56 PM | TELANGANA
    *గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి*

    జన చరిత్ర, (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
    తొర్రూరు, నవంబర్ 04

    మహబూబాబాద్ జిల్లా
    తొర్రూర్ పట్టణంలో ఉన్న ఏకైక గోశాల
    గోపాల గోవర్ధన గో సంరక్షణ గోశాల నూతన కమిటి ఏర్పాటు బుధవారం కుందూరు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ గోశాల సమావేశంలో 2026- 28 రెండు సంవత్సరాల పదవీ కాలానికి నూతన కమిటీని ప్రకటించారు.నూతన అధ్యక్షులు గా తమ్మెర లక్ష్మినర్సింహారావు,
    కార్యనిర్వాహక అధ్యక్షులు కర్ర అశోక్ రెడ్డి,,ఉపాధ్యక్షులు:తమ్మెర విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా చలువాది ఉపేందర్ రావు, కోశాధికారిగా తాటికొండ విజయబాబు లు మీడియా ఇన్చార్జిగా ఇమ్మడి రాంబాబు లు ఎన్నికైనట్లు కార్యాచరణ కమిటి కొత్తా యాదగిరిరెడ్డి,తమ్మెర వీరభద్రరావు, కొత్తా యాదగిరిరెడ్డి,,అనుమాండ్ల మోహన్రెడ్డి ,వంగపెల్లి రాజలింగం,ప్రొద్దుటూరి గౌరిశంకర్ ,చలువాది సత్యనారాయణ,పెరుమాండ్ల చక్రపాణి, లను ప్రకటించారు నూతనంగా ఎన్నికైన కమిటీని డాక్టర్ రాజేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం తొర్రూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన గోశాలను దాతల సభ్యుల గో భక్తుల గో సేవకుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని గోవులకు అవసరమైన దానాలు నీడను కల్పించడానికి ఏర్పాటు చేసుకొని గోసంరక్షణ కు పాటుపడుతున్నామని గోమాత సర్వదేవతల స్వరూపమని గోమాతను పూజిస్తే సర్వ దేవతలను పూజించినట్లేనని అన్నారు, తొర్రూరు పట్టణంతో పాటు మండలంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న గో భక్తులు ఎంతోమంది ఆర్థిక సహకారాన్ని అందిస్తూ గోమాతల ఆశీస్సులను పొందుతున్నారని ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేపట్టాలని అన్నారు. గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ శక్తి కొలది ఆర్థిక వనరులు సమకూర్చి గోమాత ఆశీస్సులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ బాధ్యులు ప్రతాపని వెంకటేశ్వర్లు చీదర వీరన్న,చకిలేల మణిరాజ్ ,మచ్చ సురేష్ ,వజినేపల్లి రమేష్,నాళ్ళ కృష్ణమూర్తి,బోనగిరి శంకర్,మాశెట్టి రమేష్,స్థల దాత జబ్బర్ సింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.