EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం

    Author
    Posted By amarender
    | 07 Nov 2026, 09:15 PM | TELANGANA
    శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు  రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం

    శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు

    రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం

    శాంతినగర్ బ్రిడ్జి వద్ద గుంతతో ప్రజలకు ఇబ్బందులు  రెండు నెలలుగా పూడ్చని గుంత.. ప్రమాదాలకు అవకాశం - Additional Image

    వరంగల్: శాంతినగర్ బ్రిడ్జి సమీపంలో నల్లా లీకేజీ మరమ్మతుల కోసం తవ్విన గుంతను ఇప్పటివరకు పూడ్చకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లీకేజీ మరమ్మతులు పూర్తయినప్పటికీ గత రెండు నెలలుగా గుంతను అలాగే వదిలేయడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

    ఇవి కూడా చదవండి

    ప్రధాన రాకపోకలు జరిగే ప్రాంతంలో గుంత ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    సంబంధిత మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు..
    రిపోర్టర్. శేఖర్