EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం వరంగల్‌లో వడ్డీ లేని సూక్ష్మ రుణాల ప్రచార కార్యక్రమం ప్రారంభం

    Author
    Posted By amarender
    | 11 Nov 2026, 03:41 PM |
    వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం  వరంగల్‌లో వడ్డీ లేని సూక్ష్మ రుణాల ప్రచార కార్యక్రమం ప్రారంభం

    వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం

    వరంగల్‌లో వడ్డీ లేని సూక్ష్మ రుణాల ప్రచార కార్యక్రమం ప్రారంభం

    వరంగల్, నవంబర్ 10:

    వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నైతిక ఆర్థిక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్‌ మండి బజార్‌లోని సేవా బ్యాంక్‌లో వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతుగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమానికి సేవా బ్యాంక్ జిల్లా అధ్యక్షుడు ఖాలిద్ సయీద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మన ఉమ్మడి కల.. వడ్డీ రహిత సమాజం” అనే నినాదంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పేద కుటుంబాలు, చిన్న వ్యాపారులు, కార్మికులకు వడ్డీ లేని ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

    ఎస్‌ఆర్‌డీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేవా, ఖిద్మత్ సహకార రుణ సంఘాల ద్వారా, కర్ణాటకలో కారుణ్య సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని హైదరాబాద్ ప్రధాన కార్యాలయ ప్రతినిధి మహమ్మద్ ఖాలిద్ వెల్లడించారు.

    ప్రస్తుతం 45 శాఖల ద్వారా లక్షా 20 వేల మందికి పైగా సభ్యులకు సేవలందిస్తున్నామని, ఇప్పటివరకు 57 వేల మందికి పైగా వడ్డీ లేని రుణాల ద్వారా లబ్ధి పొందారని వివరించారు. 2030 నాటికి మరో 100 శాఖలను ఏర్పాటు చేసి, సభ్యుల సంఖ్యను ఐదు లక్షలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలోనూ సంస్థ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సమ్మిళితత్వం, సామాజిక అభివృద్ధికి దోహదపడే ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎస్‌ఆర్‌డీఎఫ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో తాహిర్ నవాబ్, జహీరుద్దీన్, అబ్దుల్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.