EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన మట్వాడ మహిళా పోలీస్ కానిస్టేబుల్– వరంగల్ పోలీస్ కమిషనరేట్

    Author
    Posted By amarender
    | 11 Nov 2026, 03:43 PM |
    పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన మట్వాడ మహిళా పోలీస్ కానిస్టేబుల్– వరంగల్ పోలీస్ కమిషనరేట్

    పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన మట్వాడ మహిళా పోలీస్ కానిస్టేబుల్– వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడా పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ M దివ్యశ్రీ తన అద్భుతమైన క్రీడా ప్రతిభతో రెండు పతకాలు సాధించి సత్తా చాటారు.
    హైదరాబాద్‌ (మల్కాజిగిరి)లో నిర్వహించిన 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బాక్సింగ్ విభాగంలో యాదాద్రి టీమ్ పై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఖో-ఖో విభాగంలో సైబరాబాద్‌ టీమ్ తో జరిగిన పోటీలో రజత పతకాన్ని సాధించారు.
    రెండు విభిన్న క్రీడా విభాగాల్లో పతకాలు సాధించడం ఆమె క్రీడా నైపుణ్యం, పట్టుదల, కృషికి నిదర్శనం. ఆమె సాధించిన విజయాల పట్ల మాట్వాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ N కరుణాకర్ రావు మరియు ఇతర అధికారులు, సహచర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.