EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *అయ్యప్ప భక్తులకు శుభవార్త*

    Author
    Posted By Gade Krishna
    | 11 Nov 2026, 07:15 PM |

    *శబరిమలై అయ్యప్ప భక్తులకు శుభవార్త*

    *తొర్రూర్ డిపో నుంచి శబరిమలై యాత్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు.*


    జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో
    తొర్రూర్, నవంబర్ 11


    మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్,
    కార్తీక మాసం సందర్భంగా డిపో మేనేజర్ కె. ప్రసూన లక్ష్మి మాట్లాడుతూ
    శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం **TGSRTC తొర్రూర్ డిపో** ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయడం జరుగుతుంది.

    ఇవి కూడా చదవండి

    కనీసం **36 మంది భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే ప్రత్యేక బస్సును బుక్ చేసుకునే అవకాశం**
    ఈ ప్రత్యేక బస్సులకు కేరళ రాష్ట్ర సరిహద్దు టాక్స్ నుంచి మినహాయింపు ఉండటం మరో విశేషం. భక్తులు తమకు అనుకూలమైన మార్గాన్ని (Route) స్వయంగా నిర్ణయించుకునే సౌకర్యం కూడా కల్పించబడుతుంది.

    అదేవిధంగా కార్తీక మాసంలో శబరిమలై యాత్రతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు వెళ్లే భక్తుల కోసం మరియు వివాహది శుభాకార్యములకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడానికి TGSRTC తొర్రూర్ డిపో సిద్ధంగా ఉంది.

    అనుభవజ్ఞులైన, సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చే డ్రైవర్లతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం జరుగుతుంది.

    కావున తొర్రూర్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములు, భక్త బృందాలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
    **మరిన్ని వివరాలకు మరియు బస్సుల బుకింగ్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:**
    📞 9959226053
    📞 9963991518
    **TGSRTC – తొర్రూర్ డిపో**
    *మీ ప్రయాణం సురక్షితం – మా బాధ్యత.*