EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం : ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    Author
    Posted By JANA CHARITRA
    | 30 Aug 2026, 03:43 PM | TELANGANA, వరంగల్
    కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతాం : ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

    కనకదుర్గ కాలనీలోని GWMC పార్కు, కమ్యూనిటీ సెంటర్‌ను వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం సందర్శించారు. పార్కులోని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్, పచ్చదనం, మొక్కల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పార్కుకు వచ్చిన వాకర్స్, స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలు, వారి అవసరాలను తెలుసుకున్నారు.

    *ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గార్లు మాట్లాడుతూ,* కనకదుర్గ కాలనీ పార్కును ఆధునిక సౌకర్యాలతో మోడల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని GWMC అధికారులకు సూచించారు. వర్షాకాలంలో వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

    చిన్నారులకు ప్రత్యేక ఆకర్షణగా..పిల్లలు ఆడుకునేందుకు పార్కులో ప్రత్యేక ఆటస్థలాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే సూచించారు. చిన్నారుల వయసుకు అనుగుణంగా వివిధ ఆట పరికరాలను ఏర్పాటు చేసి, సురక్షితమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. కుటుంబాలతో కలిసి పార్కుకు వచ్చేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అలాగే వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని ప్రతిబింబించేలా పార్కు గోడలపై కాకతీయ కళా వైభవం, చారిత్రక కట్టడాలు, సంస్కృతి ఉట్టిపడేలా ఆకర్షణీయమైన చిత్రాలు వేయించాలని సూచించారు. పార్కు అందాన్ని పెంచడంతో పాటు నగర చరిత్రను ప్రజలకు పరిచయం చేసేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.

    వృద్ధులు, మహిళలు, యువతకు ఉపయోగపడేలా మెడిటేషన్ కోసం ప్రత్యేక హాల్ ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్ పరికరాలను మెరుగుపరచాలని తెలిపారు. సాయంత్రం వేళల్లో పార్కుకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా లైటింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు, పార్కు భద్రత కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుపైనా దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు.

    పార్కు అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటామని, అవసరమైతే తమవంతు సహకారం అందిస్తామని ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కనకదుర్గ కాలనీ ప్రజలకు మరింత మెరుగైన పచ్చదనం, ఆరోగ్యం, వినోద సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా పార్కును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుజ్జుల వసంత, gwmc అడిషనల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు, స్థానిక వాకర్ అసోసియేషన్ సభ్యులు, రిటైర్ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.