EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కళాకారులకు ఉద్యోగాలివ్వాలి మినీ పోస్టు 96 అమలు చేయాలి.. ఉద్యమ కళాకారుల డిమాండ్*ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక*

    Author
    Posted By JANA CHARITRA
    | 14 Sep 2026, 06:21 AM | TELANGANA, నల్గొండ
    కళాకారులకు ఉద్యోగాలివ్వాలి మినీ పోస్టు   96 అమలు చేయాలి.. ఉద్యమ కళాకారుల డిమాండ్*ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రభుత్వంపై ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక*

    *నల్గొండ* : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాట, ఆటలతో ప్రజలను చైతన్యపరిచిన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని నల్గొండ జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. కళాకారుల కోసం ప్రతిపాదించిన మినీ పోస్టు 96 అంశాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరింది. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు ఆరోపించారు.ఆదివారం నల్గొండలో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాకారుల ఉద్యోగాల అంశాన్ని గతంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, పాల్వాయి మహేశ్ ప్రస్తావించారని తెలిపారు. ఇటీవల శాసనమండలిలో విజయశాంతి సైతం ఈ అంశాన్ని ప్రస్తావించి ఏడాది గడిచినా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కాలయాపన ధోరణిలో మాట్లాడుతున్నారని విమర్శించారు.తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తమ పాట, ఆటలతో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఉద్యమం వైపు నడిపించామని సైదులు గుర్తుచేశారు. అలాంటి కళాకారులకు ఉద్యోగం కల్పించడం తమ హక్కు అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలోనూ తమ సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన వెంటనే కళాకారులంతా ఏకమై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.సమావేశానికి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలకొండ శ్రీనివాస్, కంచి శ్రీనివాస్, వనం లింగయ్య, కందుల సైదులు, రెమెడాల శ్రీనివాస్, మేదరి కిరణ్‌కుమార్, నరసింగరావు, కందుకూరి సుదర్శన్, ఆదిమల్ల ఎల్లయ్య, శిరసనవాడ సత్యనారాయణ, జిల్లా లలిత, శివరాత్రి రాములు తదితరులు పాల్గొన్నారు.