EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదుకార్యకర్తలే మా బలంవచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచే పోటీ

    Author
    Posted By JANA CHARITRA
    | 14 Sep 2026, 04:40 PM | TELANGANA, వరంగల్
    కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదుకార్యకర్తలే మా బలంవచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచే పోటీ

    తెలంగాణ వరంగల్ సెప్టెంబర్ 13
    వరంగల్‌: కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి,వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ,మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు.ఆదివారం వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు.పదవులు వస్తుంటాయి..పోతుంటాయని,తమకు పార్టీపై,కార్యకర్తలపై కృతజ్ఞత ఎప్పటికీ ఉంటుందని కొండా మురళి అన్నారు.రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుంటామని,కష్టపడి పనిచేసే వారికి టికెట్లు దక్కేలా చూస్తామని చెప్పారు.అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని,కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ తనకు ఇచ్చిన మంత్రి పదవికి ఎలాంటి మచ్చ తీసుకురాలేదని కొండా సురేఖ అన్నారు.పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మంత్రి పదవి కోల్పోయినందుకు బాధ లేదని,అయితే అకారణంగా తొలగించారనే వేదన ఉందన్నారు.పదవి కేవలం అలంకారం మాత్రమేనని, మంచి రోజులు మళ్లీ వస్తాయని పేర్కొన్నారు.రాజకీయాల్లో అవకాశవాదం పెరిగిపోయిందని,ఉదయం ఒక పార్టీలో ఉండి సాయంత్రానికి మరో పార్టీలోకి మారే సంస్కృతి పెరుగుతోందని విమర్శించారు.గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు.తమపై మాట్లాడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.గత పది రోజులుగా తమను నమ్ముకున్న కార్యకర్తలు మనోవేదనకు గురయ్యారని సురేఖ తెలిపారు.పార్టీ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయని,అయితే తాము కాంగ్రెస్‌ను వీడబోమని స్పష్టం చేశామని చెప్పారు.వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ నుంచే పోటీ చేస్తామని తెలిపారు.త్వరలోనే కొండా మురళికి చైర్మన్‌ పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.