EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సెప్టెంబర్ 17వ తారీఖున కిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Sep 2026, 03:24 PM | TELANGANA, వరంగల్
    సెప్టెంబర్ 17వ తారీఖున కిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం

    తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు రేవంత్ యూరెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందుకు తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తారీఖున కిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని ఉద్యమకారులు అందరు ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి కోరినారు ఉర్సు ప్రతాప్ నగర్ లో జరిగిన వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రాష్ట్ర సాధకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపుమేరకు అనేక ఉద్యమాలు నిర్వహించి అరెస్టులై కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతూ కొందరు జైలు జీవనం గడిపినారని అటువంటి వారికి ఇస్తామన్న 250 గజములు ఇంటి స్థలము 25 వేల రూపాయల పెన్షన్ రేవంత్ రెడ్డి సర్కారు మోసగించడానికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకార్యక్రమంలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరుపల్ల రవి హెచ్చరించారు ఇట్టి సమావేశంలో ఉద్యమకారులు నాగవెల్లి సాంబయ్య మేకల ఎల్లయ్య శంకేసి లింగమూర్తి అంకం దేవానంద్ కెంచ ఆనంద్ ఐత ప్రభాకర్ మాడిశెట్టి రాజకుమార్ ఆవునూరు లక్ష్మి ముసినిపెల్లి జమున కొడిపాక రమాదేవి నేల మల్లమ్మ
    చిదురాల సుజాత సోమ ఉపేంద్ర లు పాల్గొన్నారు