EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళల భద్రతే మా ప్రధాన లక్ష్యం విద్యార్థినులకు షీ టీమ్‌పై అవగాహన కల్పించిన అదనపు డీసీపీ బాలస్వామి

    Author
    Posted By JANA CHARITRA
    | 16 Sep 2026, 08:38 PM | TELANGANA, వరంగల్
    మహిళల భద్రతే మా ప్రధాన లక్ష్యం  విద్యార్థినులకు షీ టీమ్‌పై అవగాహన కల్పించిన అదనపు డీసీపీ బాలస్వామి

    తెలంగాణ/వరంగల్,సెప్టెంబర్ 16
    కాజీపేట: మహిళల భద్రతకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా వ్యవహరించాలని వరంగల్‌ అదనపు డీసీపీ(క్రైమ్స్‌)బాలస్వామి సూచించారు.కాజీపేటలోని తాళ్ల పద్మావతి ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినులు,విద్యార్థులకు షీ టీమ్‌,సైబర్‌ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండటం ద్వారా మహిళలపై జరిగే నేరాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు.సైబర్‌ నేరాలు,మహిళలపై జరిగే అఘాయిత్యాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు.క్రైమ్‌ ఏసీపీ సదయ్య మాట్లాడుతూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌,స్నాప్‌చాట్‌,టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు,వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.మహిళలు ఒంటరిగా తెలియని ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో టీ-సేఫ్‌ యాప్‌ను వినియోగించుకోవాలని తెలిపారు.ఉద్యోగినులు పనిచేసే ప్రాంతాల్లో ఆకతాయిలు,అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని,గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోరాదన్నారు.ఎవరైనా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ధైర్యంగా వెంటనే షీ టీమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.సైబర్‌ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.షీ టీమ్‌కు సంబంధించిన ఫిర్యాదులను సీపీ వాట్సాప్‌ నంబర్‌ 8712685257,సీఐ వాట్సాప్‌ నంబర్‌ 8712685142,ఎస్‌ఐ వాట్సాప్‌ నంబర్‌ 8712685270కు పంపవచ్చన్నారు.ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు నిందితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి,అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ వేణు, క్రైమ్‌ ఏసీపీ సదయ్య,షీ టీమ్‌ సీఐ సువర్ణ,ఎస్‌ఐ రామారావు,కళాశాల అధ్యాపకులు,పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.