EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పలు కుటుంబాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

    Author
    Posted By JANA CHARITRA
    | 18 Sep 2026, 02:35 PM | TELANGANA, వరంగల్
    పలు కుటుంబాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    హన్మకొండలో పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన హెచ్.ఎం. *వర్ధినేని వసంతరావు* మృతి చెందిన విషయం తెలుసుకొని గా వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
    అనంతరం పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన *ఎర్రబెల్లి వెంకటరావు* ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
    అదేవిధంగా బూర్గుమాళ్ళ గ్రామ సర్పంచ్ ఎలికట్టే కృష్ణవేణి -వేణు గారి అమ్మ గారు, అలాగే పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బాసాని ఉప్పలయ్య గారి కుమార్తె అనారోగ్యంతో రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించిన *మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు* *

    ఈ పరామర్శలో మాజీ మంత్రి గారితో సొసైటీ చైర్మన్ ఎం.మనోజ్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జీతేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు బోయినపెల్లి యుగేందర్ రావు,పట్టాపురం ఏకాంతం గౌడ్ గారు, మరియు జిల్లా, వివిధ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.